సింగరేణి కార్మికులకు అండగా టి.జి.కే.ఎస్ అబ్దుల్ అజీజ్

సింగరేణి కార్మికులకు అండగా టి.జి.కే.ఎస్ అబ్దుల్ అజీజ్

0
TMedia (Telugu News) :

సింగరేణి కార్మికులకు అండగా టి.జి.కే.ఎస్ అబ్దుల్ అజీజ్

టీ మీడియా, ఆగస్టు 27, జగిత్యాల ప్రతినిధి: సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ,అండగా ఉన్న ఏకైక సంఘం టి.ఆర్.ఎస్ అనుబంధ టి.బి.జి.కె.ఎస్ అని టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. మందమర్రి ఏరియా, రామకృష్ణాపూర్ 1ఏ గని టి.బి.జి.కె.ఎస్ ఫిట్ సెక్రటరీ గా నియమించబడిన బండారు బిక్షపతి ని శనివారం రామకృష్ణాపూర్ పట్టణ టి.ఆర్.ఎస్ కార్యాలయం లో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా సన్మానించారు.

Also Read : చాటింగ్‌ చేయ‌డం లేద‌ని బాలిక‌పై కాల్పులు

ఈ సంధర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ టి.బి.జి.క్.ఎస్ ఫిట్ సెక్రటరీ గా నియమించబడిన బిక్షపతి కి శుభాకాంక్షలు తెలిపి, కార్మికుల సమస్యలను అధికారుల తో చర్చించి పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,కౌన్సిలర్ లు పొగుల మల్లయ్య,పుల్లూరి,సుధాకర్, జాడి శ్రీనివాస్, రెవెళ్లి ఓదెలు,కో -ఆప్షన్ సభ్యులు యాకుబ్ అలీ,రజియా,నాయకులు సత్యపాల్,రామిడి కుమార్,నరెడ్ల కల్పన లు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube