బ్రాహ్మణ సధన్ మంజూరు చేయించిన మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు

ఏ ఐ బీ(ఎస్ )ఎన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ

1
TMedia (Telugu News) :

బ్రాహ్మణ సధన్ మంజూరు చేయించిన మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు

ఏ ఐ బీ(ఎస్ )ఎన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ

టి మీడియా,మే16,ఖమ్మం:
అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్) నెట్వర్కు టి ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసర సమావేశం ఆదివారం ఖమ్మం లో జరిగింది.సమావేశం ఖమ్మం లో బ్రాహ్మణ సధన్ నిర్మాణం కు ప్రభుత్వం రు 70 లక్షలు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసింది అందుకు కృషి చేసిన బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కెవి రమణచారి ,మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి, వారి వద్ద కు సమస్య ను తీసుకు వెళ్లిన సుడా డైరెక్టేర్ మాటారు లక్ష్మీనారాయణ కి, బ్రాహ్మణ సంఘం నాయకులు మారం రాజు రాధాకృష్ణ గారికి స్థల దాత కు కమిటీ ధన్యవాదాలు తెలిపింది.వ్యక్తిగత ముగా అందరిని కలవాలని నిర్ణయం చెయ్యడం జరిగింది..

Also Read : నేటి నుండి జిల్లాలో టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పర్యటన

టి మీడియా ఆధ్వర్యంలో 29 న ఖమ్మం లో నిర్వహించే జాతీయ స్థాయి ఆర్యవైశ్య వివాహపరిచయ వేదిక కు బ్రాహ్మణ నెట్వర్కు నుండి పూర్తి సహకరము అందించాలని నిర్ణయం జరిగింది.అందులో భాగంగా సోమవారం నుండి టీమ్ గా వెళ్లి ఆర్యవైశ్య పెద్దల ను కలవాలని నిర్ణయం జరిగింది..డెలివరీ లో సీజరిన్ లు ప్రోత్సాహం కల్పించే వారిపై చట్టపరమైన చర్యలు తికోవాల ని అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని సమావేశం ప్రభుత్వ పెద్దలకు తెలిపింది .సీజరిన్ లకు కారణం బ్రాహ్మణులు అనే అపవాదు వెనక్కి తీసుకోవాలని కోరింది.సమావేశంలో శనగపాటి మురళి కృష్ణ,పరిమి అనంత లక్ష్మీ,,వల్లూరు రంగారావు, రావుల పాటి శ్రీనివాసరావు,చందర్లపాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube