కేసీఆర్ ,పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ ,పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం

1
TMedia (Telugu News) :

కెసిఆర్, పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం

టీ మీడియా, ఆగస్టు 8,ఖమ్మం :జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి చిత్రపటానికి ఖమ్మం పట్టణంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్స్ మెడికల్ అకాడమీ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య హాజరై పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

Also Read : వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీలను బొందపెడతాం

ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని దీనికోసం అహర్నిశలు కష్టపడి జిల్లా అభివృద్ధి కోసం మెడికల్ కళాశాలను రాష్ట్ర రవాణా శాఖ మాత్తులు పువ్వాడ అజయ్ కుమార్ గారు తీసుకురావడం జరిగిందని, జిల్లా అభివృద్ధిలో మరో కలిగితురాయిగా “మెడికల్ కళాశాల” ఏర్పాటు జరగబోతుందని ఇది జిల్లాకు మణిహారం కాబోతుందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు జిల్లా స్వరూపాన్ని మార్చారని, ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రాయల సతీష్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube