72 వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఆదివాసి కొండరెడ్ల సంఘం.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,26, భద్రాచలం

భద్రాచలం సోయం గంగులు ( ఐ టి డి ఏ ) షాపింగ్ కాంప్లెక్స్ నందు ఆదివాసి సంక్షేమ పరిషత్,ఆదివాసి కొండరెడ్ల సంఘం,ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో 72 రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.ఈ సందర్బంగా ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగం మనదని, అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగే విదంగా అంత మహత్తరమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ రచించారన్నారు. సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రాజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగాన్ని రూపొందించుకున్న గొప్ప దేశం మన భారత దేశమని అందుకు ప్రతి భారతీయలు గర్వపడాలన్నారు.సాంఘీక, ఆర్థిక,రాజకీయ సమానత్వాన్ని,భావప్రకటనా స్వేచ్ఛను కలిగి ఉన్నామన్నారు.ప్రధానంగా ఆదివాసులకు రాజ్యంగంలో అనేక హక్కులు,చట్టాలు అనేకం ఉన్నాయని కాని వాటిని అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగ విఫలమయ్యాయని అన్నారు.పవిత్రమైన రాజ్యంగం మీద ప్రమాణం చేసి కుడా హక్కులను కాలరాస్తున్నారు అన్నారు.

రాజ్యంగం కల్పించిన రిజర్వేషన్ ద్వారా చట్ట సభలకు ఎన్నికైన కొంతమంది వారి చట్టాలకు,హక్కులకు భంగం కలుగుతున్న మౌనం వహించటం చాలా బాధాకరం అన్నారు.ఇప్పటికయినా రాజ్యంగం కల్పించిన హక్కులు కాపాడుకోవటానికి ఆదివాసుల ఐక్యం కావలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముక్య అతిథిగా జి సి సి,డి ఎం కుంజా వాణిగారు,ఆదివాసి సంక్షేమ పరిషత్ సమన్వయకర్త మడివి నెహ్రు,ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగ్గా పుల్లయ్య,గుజ్జా శ్రీను,వీసాల శ్రీ లక్ష్మి ,పాయం రాజేష్,ఈశ్వరమ్మ,రమణమ్మ,గుజ్జా వెంకట్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు .

The 72nd constitution day was celebrated with great pomp by the aboriginal Conrads community.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube