ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థి రఘురాం రెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి

0
TMedia (Telugu News) :

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి
-పలు పోలింగ్ కేంద్రాల సందర్శన
టీ,మీడియా, మే13,ఖమ్మం: కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం మహబూబాబాద్ మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం(బూత్ నంబర్ 282) లో ఓటేశారు.

MINISTOR PONGULETI
MINISTOR PONGULETI

పలు పోలింగ్ కేంద్రాల సందర్శన
నగరంలోని నృసింహస్వామి దేవాలయానికి సోమవారం ఉదయం వెళ్లి.. రామ సహాయం రఘురాo రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 57 వ డివిజన్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత బొక్కలగడ్డ, సుందరయ్య నగర్, శ్రీనివాస నగర్, ముస్తఫా నగర్, తుమ్మల గడ్డ, మామిళ్ళగూడెం, వీడివోస్ కాలనీ, బల్లేపల్లి, పాండురంగాపురం, రఘునాథపాలెం మండలం మంచుకొండ, ఈర్లపూడి, వీవీ. పాలెం, చింతకాని మండలం పొద్దుటూరు, చింతకాని, బోనకల్ మండలం రావినూతల, జానకీ పురం, వైరా మండలం పాలడుగు వైరా, రెబ్బవరం, తల్లాడ, ఏన్కూరు మండల కేంద్రాలు, జూలూరు పాడు మండలo పడమటి నరసింహాపురం పోలింగ్ సెంటర్లను సందర్శించారు.

 


ఎన్నికల నియమావళిని పాటిస్తూ..మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళని పరిశీలించారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నాయకులు బొర్రా రాజశేఖర్, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube