మతోన్మాద విధానాలపై పోరాటమే సుందరయ్య కు ఘననివాళి

మతోన్మాద విధానాలపై పోరాటమే సుందరయ్య కు ఘననివాళి

0
TMedia (Telugu News) :

మతోన్మాద విధానాలపై పోరాటమే సుందరయ్య కు ఘననివాళి
-కార్మిక రాజ్యంతోనే సుఖశాంతులు!
-ఘనంగా సుందరయ్య 39 వ వర్ధంతి!

 

 

PS CERMONY
PS CERMONY

టి మీడియా,మే 19, వేంసూరు(ఖమ్మం): దేశం పాలిస్తున్న మతోన్మాద శక్తుల ప్రజా,కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటమే అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య కు ఇచ్చే ఘన నివాళి అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్,సీపీఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు లు అన్నారు.ఆదివారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గల సీఐటీయూ కార్యాలయంలో సిపిఎం గ్రామ కార్యదర్శి డంకర శ్రీను అధ్యక్షతన జరిగిన సుందరయ్య 39 వ వర్ధంతి సభలో పాల్గొన్న ఇరువురు నేతలు మాట్లాడుతూ కుల,మత,లింగ బేధాలు లేకుండా లౌకిక దేశంగా సుఖ శాంతులతో ఉన్న ఇండియాలో మత,కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఐక్యంగా ఉన్న ప్రజలను వీడదీసి ప్రజా ధనాన్ని లూటీ చేసి కార్పొరేట్లకు వత్తాసు పలకడం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

  ALSO REASD :కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలి

 

అందరి ప్రజల హక్కులు రక్షింపబడాలన్న,బాబా సాహెబ్ రాజ్యాంగం అమలు జరగాలన్న ఎర్రజెండాలు అధికారంలోకి రావాలని,కార్మిక రాజ్యస్థాపనతోనే సాధ్యం అవుతుందనిసుఖశాంతులుకలుగుతాయన్నారు.ముందుగా సుందరయ్య చిత్ర పటానికి పుష్పాలు వేసి,రెడ్ సెల్యూట్ లు చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో:- సాధు శరత్ బాబు,బొందల యాకోబు,జుంజునూరి తిరుపతిరావు,మల్లూరు వెంకటేశ్వరి,సీఐటీయూ నేత పర్సా అప్పారావు,కనమాల జోజి,వేము రమేష్తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube