పార్టీల పునాదులు కదులుతున్నాయి

పార్టీల పునాదులు కదులుతున్నాయి

1
TMedia (Telugu News) :

పార్టీల పునాదులు కదులుతున్నాయి

టి మీడియా,జూన్,25,సిద్దిపేట :రూరల్ మండలం రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీజెండాను ఆవిష్కరించి పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రఘు నందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘8 ఏళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? సీసీ రోడ్లు ఎన్ని? పరిపాలించే నాయకులే చెప్పాలి’ అన్నారు.

Also Read : రామకృష్ణాపూర్ పట్టణ అస్తిత్వం,పునరుజ్జీవం లక్ష్యం

రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురయడం ఖాయమన్నారు. మీకు చిత్త శుద్ధి ఉంటే బచ్చాయిపల్లికి వెంటనే డబుల్ బెడ్రూం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల గుండెల్లో కాషాయం జెండా ఉన్నదని.. ఫ్లెక్సీలలో మాత్రం మీ బొమ్మలున్నాయని టీఆర్ఎస్‌నుద్దేశించి రఘునందన్ పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube