ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది

మంత్రి పొన్నం ప్రభాకర్‌

0
TMedia (Telugu News) :

ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది

– మంత్రి పొన్నం ప్రభాకర్‌

టీ మీడియా, జనవరి 4, హైదరాబాద్‌ : రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.సెలూన్‌, లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు. ఎవరు అధైర్యపడవద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Also Read : 6న డిప్యూటీ సి ఏం భట్టి విక్రమార్క కి పౌర సన్మానం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube