భూముల ధరలను పెంచ్చనున్న సర్కార్‌

0
TMedia (Telugu News) :

భూముల ధరలను పెంచ్చనున్న సర్కార్‌

 

టి మీడియా, మే 31 ,అమరావతి :     

    ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల ధరల పెంపుదలకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. గత ఏడాది భూమి విలువ పెంచిన కొత్త జిల్లాల్లో కాస్త తక్కువగా భూముల ధరలను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 30 నుండి 35 శాతం వరకు భూముల విలువ పెరగనుంది. జూన్‌ 1వ తేదీ నుండి భూముల విలువ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల కోసం పెద్ద ఎత్తున ధరఖాస్తులు వస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలోని 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీ కూడ పెరగనుంది. స్టాంప్‌ డ్యూటీ పెరగడంతో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube