అధైర్యపడొద్దు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

అధైర్యపడొద్దు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

0
TMedia (Telugu News) :

అధైర్యపడొద్దు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

– సిఎం జగన్‌

టీ మీడియా, డిసెంబర్ 6, తాడేపల్లి : ఎపిలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్‌, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ … ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని, తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయని అన్నారు. అధికారులంతా వారివారి ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దఅష్టిపెట్టాలన్నారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని చెప్పారు. రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలని అన్నారు. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళుతున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలని అన్నారు. రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని చెప్పారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారు అధైర్యపడాల్సిన పనిలేదని సిఎం అన్నారు. పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుందన్నారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

Also Read : రేవంత్ నాయ‌క‌త్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్మిస్తాం

ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ సమీక్షలో క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్‌, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టీ కఅష్ణబాబు, హౌంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి వీరపాండియన్‌, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ బి మహమ్మద్‌ దీవాన్‌, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube