ఆసుపత్రి నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్

ఆసుపత్రి నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్

1
TMedia (Telugu News) :

ఆసుపత్రి నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్

టీ మీడియా, నవంబరు 10, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే వంద పడకల ఆసుపత్రికి సంబంధించి హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎం.ఎల్.ఏ బాల్క సుమన్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే చెన్నూరు పట్టణం, మండలం, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలతో పాటు వేమనపల్లి మహదేవపూర్ (కాళేశ్వరం), సిరోంచ వరకు సుమారు 150 పైగా గ్రామాలకు చెందిన సుమారు రెండు లక్షల మందికి వైద్య సదుపాయం మెరుగవనున్నట్లు తెలిపారు.

Also Read : లాలూకు కిడ్నీ దానం చేయనున్న కుమార్తె

సకల వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రిని వీలైనంత తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో టీఎస్ఎంఎస్ఐడిసి ఎస్ఈ దేవేందర్ కుమార్, ఈఈ రవీందర్, డిప్యూటీ ఈఈ నర్సింహ రావు, ఏఈ ముబీన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube