పీడిత ప్రజల ఆశాజ్యోతి సుందరయ్య

శ్రామికవర్గ క్రాంతి పుచ్చలపల్లి

1
TMedia (Telugu News) :

పీడిత ప్రజల ఆశాజ్యోతి సుందరయ్య!

-శ్రామికవర్గ క్రాంతి పుచ్చలపల్లి
టి మీడియా, మే19,వేంసూరు:పీడిత ప్రజల ఆశాజ్యోతి,శ్రామికవర్గ క్రాంతి అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య అని సీఐటీయూ,సీపీఎం నేతలు మల్లూరు చంద్రశేఖర్, మోరంపుడి వెంకటేశ్వరరావు లు అన్నారు.గురువారం స్థానిక ఎర్ర రామయ్య భవన ఆవరణలో సుందరయ్య 37 వ వర్ధంతి సభ జరిగింది.ముందుగా పుచ్చలపల్లి చిత్ర పటానికి పూలమాలలు,పుష్పాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు,అభివాదం చేశారు.

Also Read : ఉపాధ్యాయుడు అమరా సత్యనారాయణ ఆకస్మిక మృతి

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారత దేశంలో కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎర్ర జెండా బాటలో తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమించిన యోధుడు సుందరయ్య అన్నారు.నేటి పాలకులు దేశ ప్రజల హక్కులను రాబందులా హరిస్తున్నరాని లౌకిక ప్రజాస్వామ్య విధానాన్ని కాపాడుకున్నేదానికి,కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజా పోరాటాలు చేయడమే సుందరయ్య కు ఇచ్చే ఘన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో:సీఐటీయూ,సీపీఎం కార్యకర్తలు దానే గౌరీశంకర్,బేతిని నాగేశ్వరరావు,బూరుగు శ్రీదేవి,లక్ష్మి,సృజన,రామినేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube