మూన్నెళ్లలో దర్యాప్తు పూర్తి చేయాలి

-అదానీ-హిండెన్‌బ‌ర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

0
TMedia (Telugu News) :

మూన్నెళ్లలో దర్యాప్తు పూర్తి చేయాలి

-అదానీ-హిండెన్‌బ‌ర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

టి మీడియా, జనవరి 3,ఢిల్లీ :అదానీ – హిండెన్‌బ‌ర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విషయంలో జరుగుతున్న విచారణనను సెబీ నుంచి సిట్ కు బదిలీ చేయాలని దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సెబీ నుంచి విచారణను బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ సెబీ విచారణను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది. భారతీయ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం, సెబీ సేఫ్ గార్డ్ లుగా ఉన్నాయని, నిపుణుల కమిటీకి వ్యతిరేకంగా ఆరోపణలు అవాస్తవం అని సుప్రీంకోర్టు వెల్లడించింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఇప్పటి వరకు ఇరవైకుపైగా అంశాలపై సెబీ తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది.

Also Read : నల్లగొండ సీటు కోసం బీజేపీలో పెరుగుతున్న డిమాండ్

మరో రెండు అంశాలకు సంబంధించి మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేసి అందించాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. భారత ఇన్వెస్టర్లకు సంబంధించిన ప్రయోజనాలను కాపాడేదిశగా భారత ప్రభుత్వం, సెబీ వ్యవహరించాలని తీర్పు సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బ‌ర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అదానీ గ్రూప్ షేర్లన్నీ కుప్పకూలిపోయాయి. అయితే, హిండెన్‌బ‌ర్గ్ నివేదిక తరువాత దీనిపై నిజనిజాలు తేల్చాలని సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. గతేడాది మార్చిలో ఈ పిటీషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెబీ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఆరు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. దర్యాప్తులో సెబీ ఆలస్యం చేస్తుందని, సుప్రీంకోర్టు పెట్టిన గుడువు పాటించనందుకు సెబీపై చర్యలు తీసుకోవాలని, మరో సంస్థకు విచారణను బదిలీ చేయాలని కోరుతూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్ల పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 24న తీర్పు రిజర్వు చేసింది. తాజాగా తీర్పును వెల్లడించింది.
గౌతమ్ అదానీ ఏమన్నారంటే ..

Also Read : 3 రోజులపాటు అంతర్జాతీయ పతంగి పండగ..

సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నిజం బయటకొస్తుంది.. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి నా కృతజ్ఞతలు , భాతరదేశం వృద్ధి మా సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే సుప్రీంకోర్టు తీర్పుకు ముందు అదానీ గ్రూప్ షేర్లు కొంతమేర తగ్గాయి.. తీర్పు తరువాత షేర్లు ఊపందుకున్నాయి.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube