ఏదుల రిజర్వాయర్ పై ఎమ్మెల్యేది అవగాహన రాహిత్యం

గట్టు యాదవ్,వాకిటి.శ్రీదర్

0
TMedia (Telugu News) :

ఏదుల రిజర్వాయర్ పై ఎమ్మెల్యేది అవగాహన రాహిత్యం

– గట్టు యాదవ్,వాకిటి.శ్రీదర్
-ఛైర్మెన్, వైస్ చైర్మన్

టీ మీడియా, జనవరి 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటి దగ్గర శనివారం విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రైతులు పచ్చగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు.పార్టీలు మారినంత మాత్రాన ప్రాంత ప్రయోజనాలు మారవు.
లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి అపరభగీరతుడుగా నిలిచిన నిరంజన్ రెడ్డి. పాలమూరు, రంగారెడ్డి, ఏదుల రిజర్వాయర్ తెలంగాణకే తలమానికం
ఎదుల రిజర్వాయర్ కు 7టి. ఎం.సి నీళ్ళు ఎందుకు అంటారా.ఏదుల ఎందుకోసం కట్టారు ? ఎవరికోసం కట్టారు ? డబ్బుల కోసం కట్టారు అనడం అవివేకం.వనపర్తి నెత్తిన నీళ్ల కుండ ఏదుల రిజర్వాయర్ .

Also Read : ఏమైంది రాయుడు

ఇది కాంగ్రెస్ పార్టీ మాటలా ? ఎమ్మెల్యే మాటలా ?ఏదుల రిజర్వాయర్ పై ఎమ్మెల్యేది అవగాహనా రాహిత్యం.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 12.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి సంకల్పించినప్పుడు ఇప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పుడు మంత్రిగా ఉన్నాడు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అనవసరం అయితే ఆయన ఎందుకు వద్దనలేదు ? ప్రాజెక్టు మొదలయ్యే నార్లాపూర్ వద్ద కూడా ఆయకట్టు రాదు . నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ ఇలా ప్రాజెక్టు దశలవారీగా ముందుకు పోతుంది.ఏదుల రిజర్వాయర్ ప్రతిపాదనల్లోనే వనపర్తికి నీళ్లు తీసుకునేందుకు అనుకూలంగా ఓటి (ఆఫ్ టెక్ స్ట్రక్చర్/తూము) ఉన్నది.

Also Read : గుండెపోటుతో మరణం..

వనపర్తి నియోజకవర్గంలోని డీ8, ఇతర అన్ని అవసరాలకు అనుగుణంగా నీళ్లు తీసుకునే విధంగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.ఏడు టీఎంసీల నీళ్లు రిజర్వాయర్ లో ఉండడం మూలంగా చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా భూగర్భజలాలు పెరుగుతాయి.కనీస పరిజ్ఞానం లేకుండా, అక్కసుతో మాట్లాడడం కాదు . తెలియకుంటే తెలుసుకుని మాట్లాడాలి .. తెలివితక్కువగా మాట్లాడొద్దు నిత్యం నిందారోపణలు వేయడమే కార్యక్రమంగా పెట్టుకుంటే అభాసుపాలయ్యేది నువ్వే.
మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదుల రిజర్వాయర్ మీద మాట్లాడిన అవివేకపు మాటలపై సమాధానం చెప్పాలి వివరణ ఇవ్వాలి. శంకుస్థాపన చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ కు మళ్లీ శంకుస్థాపనలు చేయడం గల్లీలో చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు ఉంది.

Also Read : ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఆశలు వదులుకోవల్సిందేనా

ఎక్కడికి పోయినా ఆధారాలు లేని ఆరోపణలతో కాలం సాగదీయడం మాని చివరిదశలో ఉన్న అభివృద్ది పనులు సంపూర్ణమయ్యేలా చూస్తే మంచిది అన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో కౌన్సిలర్స్ బండారు.కృష్ణ, పాకనాటి.కృష్ణ,కంచె.రవి, సమధ్,నాయకులు కోళ్ల.వెంకటేష్,జాతృ నాయక్, నందిమల్ల.అశోక్, తిరుమల్, కృష్ణ,శారవంద,స్టార్.రహీమ్,పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube