నూతన పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి
బీసీ, మహిళా బిల్లులను ఆమోదించాలి కేసీఆర్ దళిత పక్షపాతి కనుకనే తెలంగాణా కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు
కేసీఆర్ సుపరిపాలన వల్ల తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్
హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఘనత కేసీఆర్ ది
– పార్లమెంట్ లో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు

టీ మీడియా, సెప్టెంబర్ 18,
కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ లో ఎంపీ నామ మాట్లాడారు. తెలంగాణా సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందని పేర్కొంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణా నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్ లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దళిత పక్షపాతిగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా దళిత బంధు పధకం ప్రవేశపెట్టి, దళితులకు రూ.10 లక్షల వంతున వారి అభివృద్ధికి సాయం చేయడం జరుగుతుందన్నారు.