ఓబీసీ మహాసభ విజయవంతం చేయాలి   

ఓబీసీ మహాసభ విజయవంతం చేయాలి   

0
TMedia (Telugu News) :

 ఓబీసీ మహాసభ విజయవంతం చేయాలి

-ఆడేపు లక్ష్మీనారాయణ

టీ మీడియా, ఆగస్ట్ 6, జన్నారం:

తిరుపతిలో జరిగే జాతీయ ఓబిసి మహాసభను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం మండల కమిషన్ సిఫార్సుల అమలు చేయాలని దేశవ్యాప్తంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కుల గణనాన చెప్పట్టి చ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ జాతీయ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందని వారు కోరారు. నేడు సోమవారం రోజున తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలోని మహతి ఆడిటోరియంలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభను బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేసి మహాసభలో ప్రవేశపెట్టాల్సిన డిమాండ్లు తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేయడానికి జాతీయ సంఘం పూనుకొని మన హక్కులను సాధించుకొనడానికి జాతీయ సంఘాల ముందుకు వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోడూరు చంద్రయ్య, కేఏ నరసింహులు, కడర్ల నరసయ్య, బాలసని శ్రీనివాస్ గౌడ్ ,ఎంబడి సత్తన్న ,కోడి జుట్టు రాజన్న, పిల్లి మల్లయ్య, మూల భాస్కర్ గౌడ్, ఐలవేణి రవి ,తడితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube