కదం తొక్కిన ప్రజానికం

- వరదల తరలి వచ్చిన ప్రజలు, మేఘారెడ్డి అభిమానులు

0
TMedia (Telugu News) :

కదం తొక్కిన ప్రజానికం

– వరదల తరలి వచ్చిన ప్రజలు, మేఘారెడ్డి అభిమానులు

టీ మీడియా, నవంబర్ 3, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన లభించింది వేలాదిగా వనపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేఘాట్ అభిమానులు సమావేశానికి స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మేఘా రెడ్డి మాట్లాడుతూ.. 2009వ సంవత్సరంలో కొల్లాపూర్ నియోజక వర్గంలో డిపాజిట్ కోల్పోయిన ప్రస్తుత ఎమ్మెల్యే 2014 ఎన్నికల్లోను ఓటమిపాలయ్యాడని తన రక్తం ధార పోసి కాలువలు నిర్మాణం చేపడితే 2018 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడాల్సిన మంత్రి భూకబ్జాలకు పాల్పడ్డారని అల్లంపూర్, పెబ్బేరు సంత వనపర్తి రాజా దేవాదాయ భూములు పెద్దమందడి మోజర్ల పానగల్ మండలంలో తన ఫామ్ హౌస్ లు ఏర్పాటు చేసుకొని. ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు.2018 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, చిన్నారెడ్డి రెండు ముసలేద్దుల్లా ఉన్నారని వారిని ఓడిస్తే తప్ప వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందదని చెప్పిన నిరంజన్ రెడ్డి నేడు అభివృద్ధి పథం పేరుతో అంతా అవినీతి పాలన కొనసాగిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.

Also Read : ఓట్ల కోసమే కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు

ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిరుపేద ప్రజలకు నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు.గతంలో ఉన్న రెండు ముసలేద్దుల సరసన ఈయన కూడా చేరిపోయాడని ఇకముందు ఈ మూడు ముసలేద్దులను ఇంటికి పంపించాల్సిందేనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వేలలో తన పేరు ముందుందని.చిన్నారెడ్డి తనకున్న పలుకుబడితో చివరి నిమిషంలో తన పేరు రాయించుకున్నాడన్నారు. అధిష్టానం ప్రస్తుతం పునరాలోచన చేస్తుందని ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాల అమలులో మొట్టమొదటగా రెండు లక్షల ఉద్యోగాలను నియమిస్తుంది అన్నారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీ.ఎకరాకు 15వేల పెట్టుబడి సహాయం .కౌలు రైతులకు ఎకరాకు 12 వేల రూపాయల పెట్టుబడి సహాయం.మహిళలకు 2,500 నెలకు ఆర్థిక సహాయం, వృద్ధులకు వితంతువులకు నాలుగువేల పింఛన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,మహిళా విద్యార్థులకు స్కూటీల పంపిణీ.ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల .రూపాయల ఆర్థిక సహాయం లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.మీరు నన్ను దీవించి అసెంబ్లీకి పంపితే మీ కొడుకునై, మీ అన్ననై, మీ బిడ్డనై, ఐదేళ్లు మీ సేవ చేసుకుంటానని ఎక్కడ ఏమాత్రం అవినీతికి పాల్పడిన తనను ఇదే చౌరస్తాలో రాళ్లతో కొట్టి చంపాలన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా మండలం లోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీ లకు చెందిన 225 కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read : గట్ల ఖానాపూర్ లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవికిరణ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు రమేష్, గణపురం మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, ఖిల్లా గణపురం మండల రైతుబంధు సమితి అధ్యక్షులు వెంకట్రావు. ఖిల్లా గణపురం మండలం సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజు, మానాజిపేట్ మాజీ సర్పంచ్ సతీష్, శ్యాంసుందర్ రెడ్డి, మాజీ సర్పంచులు సత్య శీలా రెడ్డి, పాపిరెడ్డి నాయకులు కార్యకర్తలు యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube