టిఆర్ఎస్ పోరాటాల ఫలితమే నల్ల చట్టాల రద్దు …

0
TMedia (Telugu News) :

– రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు పట్ల టిఆర్ఎస్ శ్రేణుల హర్షం…

టీ మీడియా, నవంబర్ 19, మణుగూరు:

టిఆర్ఎస్ పార్టీ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగిందని మణుగూరు జెడ్పీటీసీ పొశం నరసింహారావు అన్నారు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నల్ల చట్టాల రద్దు పట్ల టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బముగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దొడ్డిదారిలో దోశిపెట్టేందుకు నల్ల చట్టాలను వెతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటాలకు సీఎం కేసీఆర్ అండ గా నిలిచారని, పార్లమెంటలో టీఆర్ఎస్ ఎంపీలు రైతుల పక్షాన గళం వినిపించారు అని గుర్తుచేశారు, దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు అని అన్నారు .ఈ కార్యక్రమంలో మణుగూరు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, మణుగూరు పట్టణ అధ్యక్ష కార్యదరుషులు అడపా అప్పరావు, బొలిశెట్టి నవీన్ , మణుగూరు వైస్ ఎంపీపీ కేవీరావు, సమితి సింగారం పంచాయతీ ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, కుర్రి నాగేశ్వరరావు, జవీద్ పాషా, ముద్దంగుల కృష్ణ, మేకల రవి, ప్రభుదాస్, బాబుజన్ మరియు మహిళ నాయకురాలు పాల్గొన్నారు.

The repeal of black laws is the result of the TRS struggles..
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube