ఓటు హక్కు విలువైనది

0
TMedia (Telugu News) :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

టీ మీడియా, నవంబర్ 17, మహానంది:

మహానంది మండల తహసిల్ధార్ ఆదేశాల మేరకు బుధవారం వారి కార్యాలయంలో ఎలక్షన్ స్పెషల్ సమ్మరి రివిజన్-2022 పై జరిగిన సమావేశంలో బి.ఎల్.ఓ లకు తగు సూచనలు జారీ చేశారు. ఈ నెల 20,21 వ తేదీలలో జరిగే ఎలక్షన్ స్పెషల్ క్యాంపెయిన్ డే లో ప్రతి ఒక్క బి.ఎల్.ఓ తప్పనిసరిగా వారికి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ లో ఓటర్లకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 01.01.2022 లోపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లు గా నమోదు అయ్యేలా చూడాలని అలాగే రేషన్ కార్డ్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న రేషన్‌ కార్డుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జనార్దన్ శెట్టి,డిప్యూటీ తహసిల్దార్ నారాయణ రెడ్డి,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేంద్రుడు, మండల ఎలక్షన్ ఆపరేటర్ మణికంఠ వి.ఆర్.ఓ లు,పంచాయతీ సెక్రెటరీ లు బి.ఎల్.ఓ లు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube