పల్లె ప్రకృతి వనంను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

పల్లె ప్రకృతి వనంను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

1
TMedia (Telugu News) :

పల్లె ప్రకృతి వనంను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

టి మీడియా, జూన్4,ములుగు: జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బృహత్ పల్లె ప్రకృతి వనంను ప్రారంభించిన గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ .పల్లె ప్రకృతి వనంలోని వాకింగ్ ట్రాక్ ను , సుందరంగా తీర్చిదిద్ది త్వరలో గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.చల్వాయి గ్రామంలో లక్నవరం పర్యాటకుల కోసంకమ్యూనిటీ కిచెన్ షేడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన ,స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.అనంతరం చల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించారు.

Also Read : ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోనీ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, యువతశారీరకంగా,మానసిక ఉల్లాసం తో దృఢంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తెలంగాణ క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేయాలని సూచించారని, ప్రతి వార్డులో,గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ప్రతి గ్రామపంచాయతీలో, అర్బన్ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగనాలను సద్వినియోగం చేసుకుని యువత క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తోపాటు…. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య,అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠీ, గణేష్.ఏ ఎస్పీ సుధీర్ కేకాన్, జడ్పిటిసి హరిబాబు,సర్పంచ్ ఈసం సమ్మయ్య, రైతుబంధు కోఆర్డినేటర్ పళ్ళ బుచ్చయ్య,గోవింద్ నాయక్,ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర ఎంపీటీసీలు,అధికారులు,ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube