మానస పల్లి లో ఏం జరిగింది

0
TMedia (Telugu News) :

రైతుల పాలిట గుడిబండ గా మారనున్న 11 సర్వే నెంబర్
టీ మీడియా, నవంబర్ 20, ఏటూర్ నాగారం (రూరల్)
ఎటునాగారం మండల కేంద్రంలోని మానస పల్లి గ్రామ రెవెన్యూ శివారు 11 సర్వే నెంబర్ లోని జంపన్న వాగు పరివాహక ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో అనుమతులు పొందిన సుమారు 30 మంది రైతుల పట్టా భూములు లోని ఇసుక మేటలు తొలగించడానికి అనుమతులు పొందిన క్రమంలో కొన్ని గిరిజన సంఘాలు అభ్యంతరాలు చెప్పిన క్రమంలో అర్ధాంతరంగా ఇసుక క్వారీ ఆగిపోవడం జరిగింది.
అసలు ఏం జరిగింది ?
11వ సర్వే నెంబర్లో వాస్తవంగా ఇసుకమేట పోసిన రైతుల భూములు కాకుండా పంటలు పండిస్తున్న రైతుల భూముల పేరిట అనుమతులు పొందారు అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల అండ దండ లతో రెవెన్యూ మైనింగ్ అధికారులను డబ్బులతో ప్రలోభపెట్టి ఇట్టి క్వారీ కి అనుమతులు పొందినారు 11వ సర్వే నెంబర్లు మొత్తం విస్తీర్ణం పదకొండు వందల ఎకరాలు ఇందులో రైతుల పేరిట 1980 నుండి సుమారు నాలుగు వందల ఎకరాలు రైతులు పట్టా కాస్తూ కలిగి ఉన్నారు మిగతా విస్తీర్ణం ఫారెస్ట లో ఉంది ఇదే అదునుగా ఫారెస్ట్ అధికారులు మొత్తం 11వ సర్వేనెంబర్ ఫారెస్ట్ ఏరియా అని రైతులను ఇబ్బంది పెట్టేన క్రమంలో రైతులు కోర్టుకు వెళ్లడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన గా మారి రైతుల పాలిట గుదిబండగా మారె అవకాశం ఉందని పలువు రైతులు ఆరోపిస్తున్నారు.

The sand quarry was halted in April this year in the Jampanna Vagu catchment area of Survey N0.11 .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube