నిండు ప్రాణాలను మింగేసిన వాటర్ హీటర్
టీ మీడియా, ఫిబ్రవరి 3,విజయవాడ : నీటిని వేడి చేసుకోవడానికి ఉపయోగించే వాటర్ హీటర్ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. చిన్న నిర్లక్ష్యం తండ్రి, కూతురుల ప్రాణాలకు పోవడానికి కారణంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. సత్యనారాయణపురంలోని రామానగర్‌లో పసుపులేటి మంగమ్మ ఆమె భర్త గోపినాథ్‌తో పాటు ఆమె తండ్రి ఇప్పిలి సింహాచలం నివాసం ఉంటున్నారు.ఈ సమయంలో శుక్రవారం ఉదయం స్నానానికి నీళ్లు వేడి చేసుకునేందుకు హీటర్ ను ఉపయోగిసత్ఉన్న క్రమంలో.. సింహాచలంకు షాక్ తగిలింది. తండ్రి కేకలతో వేయడంతో అతన్ని పట్టుకుంది కుమార్తె మంగమ్మ. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు వైద్యులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో తండ్రి, కుమార్తె మృతి చెందడంతో రామానగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.