ఈ దొంగలు మామూలోళ్లు కాదు

మునిసిపల్ ఉద్యోగులమంటూ వస్తారు

1
TMedia (Telugu News) :

ఈ దొంగలు మామూలోళ్లు కాదు

– మునిసిపల్ ఉద్యోగులమంటూ వస్తారు
– ఉన్నదంతా ఊడ్చేస్తారు .
టీ మీడియా, ఆగస్టు 30, వరంగల్ : మునిసిపల్ ఉద్యోగులమని ఇంటికి వస్తారు. మాటలతో మాయ చేసి ఇంటిలో ఉన్న వ్యక్తుల చూపు ఏమార్చి… తరువాత ఇంటినే దోచేస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. మునిసిపల్ ఉద్యోగులమని చెప్పి ఇంటికి వచ్చి దొంగతనానికి ముందు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తారు. తర్వాత రోజు వెళ్లి మునిసిపల్ ఉద్యోగులమని గృహస్థులకు పరిచయం చేసుకుంటారు. మీ ఇంటి సెప్టిక్ ట్యాంక్ కొలతలు తీసుకోవాలంటూ ఇంటి వ్యక్తులను మాటల్లో పెట్టి మాయ చేస్తారు. ముగ్గురిలో ఒక వ్యక్తి కొలతలు తీసుకుంటూ ఇంట్లో వారి దృష్టిని ఏమార్చుతాడు.

Also Read : కుప్పంలో ఉద్రిక్తత

ఇంకో వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఉన్న నగదు బంగారాన్ని దొంగిలించుకువస్తాడు. ఇలా దొంగతనాలు చేయడం వారికి చాలా సులువైన పని. ముఠాకు దొంగతనాలు చేయడం కొత్తేమీ కాదు. 2018లో చోరీ కేసులో జైలుకి వెళ్లిన ఈ ముగ్గురు తిరిగి బెయిలుపై బయటకు వచ్చారు. ఈ ముఠా మునిసిపల్ ఉద్యోగుల ముసుగులో దొంగతనాలు చేస్తారు. జూలై 29న కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గోపాలపురం సప్తగిరి కాలనీలో చోరీకి పాల్పడ్డారు. సెప్టిక్ ట్యాంక్ కొలవాలంటూ ఇంటి యజమానులతో మాటలు కలుపుతారు. మరో వ్యక్తి ఇంట్లోకి చొరబడి సొమ్మును కాజేస్తాడు. వీరి పని పూర్తికాగానే బైక్ పై ఉన్న మరో వ్యక్తి ఇదొక విధంగా సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ముఠా మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులు: బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వరంగల్ కమిషనర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో టవర్ లోకేషన్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు.

 

Also Read : ఉయ్యాలే ఉరితాడై..చిన్నారి ఊపిరి తీసింది

కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలలో చోరీకి పాల్పడి హన్మకొండకు వస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈక్రమంలో కిట్స్ కళాశాల వద్ద బైక్ పై వస్తున్న ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, చేసిన తప్పులను ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 15 లక్షల 50 వేల నగదును, 320 గ్రాముల బంగారంతో పాటు నకిలీ గుర్తింపు కార్డులు, సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకొని ఛేదించిన సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్ స్టేషన్ పోలీస్ సిబ్బందిని వరంగల్ కమిషనర్ సీపీ తరుణ్ జోషి అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube