నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం
– 7 కంప్యూటర్లు చోరీ
టీ మీడియా, జనవరి 13, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి. భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను మాయం చేశారు. అయితే విషయాన్ని గమనించిన అధికారులు.. ఇది ఇంటి దొంగ పనేనని భావించారు. దీంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొంగతనం దృశ్యాలు రికార్డు అయ్యాయి. కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన వ్యక్తిని అకాడమీలో ఐటీ సెక్షన్లో పనిచేస్తున్న చంద్రశేఖర్‌గా గుర్తించారు. దీంతో పోలీస్ అకాడమీ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.