కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ..
-రెండు విగ్రహాల అపహరణ
లహరి, పిబ్రవరి 24,జగిత్యాల : జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దొంగలు విగ్రహాలను అపహరించుకుని వెళ్లారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో దొంగలు రెండు విగ్రహాలను ఎత్తుకెళ్లారుప్రధాన ఆలయం తాళాలు పగులగొట్టి స్వామి వారి వెండి మకర తోరణంతో పాటు పలు వెండి వస్తువులు అపహరించుకొని వెళ్లినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఆలయంలోకి భక్తులతోపాటు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.