షట్టర్ తాళాలు పగలగొట్టి.. గ్యాస్ కట్టర్ తో లాకర్లు కట్ చేసి

ఎనిమిది కేజీల బంగారం కొట్టేశారు

1
TMedia (Telugu News) :

షట్టర్ తాళాలు పగలగొట్టి.. గ్యాస్ కట్టర్ తో లాకర్లు కట్ చేసి

-ఎనిమిది కేజీల బంగారం కొట్టేశారు
టి మీడియా,జులై 5,నిజామాబాద్ : ఓ బ్యాంక్‌ను దొంగల ముఠా దోచేసింది. లాకర్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి మూడున్నర కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసింది. ఈ ప్రయత్నంలో లక్షల రూపాయల క్యాష్‌ కాలిపోయింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ లో రాబరీ జరిగింది. అర్ధరాత్రి షట్టర్‌ తాళాలు పగలగొట్టి బ్యాంక్‌లోకి చొరబడిన దొంగలు సీసీటీవీ కెమెరాలను కట్‌ చేశారు. పోలీసులకు అలెర్ట్‌ మెసేజ్‌ పంపే డివైజ్‌ను బ్రేక్‌ చేశారు. తర్వాత లాకర్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కోసేశారు. ఆరితేరిన దొంగల ముఠా పక్కా స్కెచ్‌ వేసి ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. లాకర్‌లో ఉన్న 830 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు.

 

Also Read : అయ్యో.. తల్లి రేణుకా..!

 

దీని విలువ సుమారు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఖాతాదారులు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం. దొంగలు లాకర్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసేప్పుడు సుమారు 7 లక్షల 30 వేల నగదు, డాక్యుమెంట్లు కాలిపోయాయి. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. దొంగల్ని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు.మరో ఘటనలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరుపల్లిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 85 వేల వరకు నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి వేళ కిటికీలను గ్యాస్‌ కట్టర్‌తో కట్ చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంకులోని కెమెరాలకు బ్లాక్ కలర్ వేసి, లాకర్ తాళాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube