జవాబుదారితనం ఉండాలి
-ప్రొటోకాల్ పాటించాలి
-దిశ జిల్లా కమిటీ లో ఎంపీ నామ
టీ మీడియా, నవంబర్ 26,భద్రాద్రి కొత్తగూడెం : దిశ జిల్లా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించినఎంపీ నామ నాగేశ్వరరావువివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.ఈ సందర్బంగా నామ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా బాధ్యతతో పరిష్కరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మరో ముఖ్యమైన విషయం ప్రోటోకాల్ అన్నారు. అందరూ తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించి తీరాలన్నారు.8 ఏళ్లలో తెలంగాణ అనూహ్యంగా అభివృద్ధిని సాధించి, అవార్డుల పంట పండిస్తుందన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి వల్ల వాటి రూపు రేఖలు మరిపోయాయని అన్నారు. ఇందుకు నిదర్శనం తెలంగాణ కు వచ్చిన అవార్డులేనన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై ఎంపీ నామ సంబంధిత అధికారుల చేత సవివరణ ఇప్పించారు.
Also Read : జైలు భోజనంపై జైన్ పిటిషన్.. కొట్టేసిన ఢిల్లీ కోర్టు
ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిస్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని నామ సంబంధిత అధికారులను ఆదేశించారు.వచ్చే సమావేశం నాటికి సమస్యలు పరిష్కారం చేసేలా చూడాలని నామ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ కవిత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే లు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మీ, కలెక్టర్ అనుదీప్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.