చంద్రబాబును చంపేస్తామని చెబుతున్నారు : లోకేశ్
టీ మీడియా, అక్టోబర్ 28,రాజమండ్రి : ” చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా వైసిపి నేతలు చెబుతున్నారు ” అని టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. చంద్రబాబును బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని.. ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడటం సహజమే కానీ చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా వైసిపి నేతలు చెబుతున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.