ద్విచక్ర వాహనాల దొంగ ను అరెస్ట్

ఐదు మోటర్ సైకిల్లు స్వాధీనం

1
TMedia (Telugu News) :

ద్విచక్ర వాహనాల దొంగ ను అరెస్ట్

-ఐదు మోటర్ సైకిల్లు స్వాధీనం

టీ మీడియా అక్టోబర్ 18 ఓదెల : మద్యానికి బానిసై ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడు తున్న దొంగను పోత్కపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పొత్క పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గూడెం గ్రామ శివారులో పోత్కపల్లి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామానికి చెందిన గుంటి శ్రవణ్ తండ్రి లేట్ సదయ్య, వయస్సు 30 సంవత్సరాలు, కులం ఉప్పర, కూలి, అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా జీలకుంట, షానగొండ గ్రామాలలో జరిగిన బైక్ దొంగతనాలను తానే చేశానని నేరం ఒప్పుకున్నాడన్నారు.

Also Read : అక్రమ కేసులు ఎత్తివేయాలి.

అంతేకాకుండా ఇంకా మూడు బైకు దొంగతనాలను చేసినట్టు ఒప్పుకున్నాడన్నారు. అందులో పోలీస్ స్టేషన్ పొత్కపల్లి-02 పోలీస్ స్టేషన్ మంథని-01 పీఎస్ బసంతనగర్-01 , పీఎస్ ధర్మారం-01.గతంలో కూడా ఇతను నేరాలలో పాల్గొన్నాడు, అందులో నాలుగు కేసులలో శిక్ష పడినది.గతంలో ఇతనీ పై ఒక సస్పెక్ట్ షీట్‌ని ఓపెన్ చేసినాము. గ్రామాలలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు ఉన్నట్లయితే డయల్ 100 కు సమాచారం అందించగలరన్నారు పోత్కపల్లి ఎస్సై లక్ష్మణ్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోత్కపల్లి సిబ్బందిని ఏసిపి అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube