టీ మీడియా, డిసెంబర్ 2, మహానంది:
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో గురువారం చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ చంద్రశేఖర్ ఆద్వర్యంలో తిమ్మాపురం ఏపి మోడల్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువతీ, యువకులు హెచ్ఐవి పట్ల అవగాహనా కలిగి ఉండాలని తిమ్మాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని తద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.