మున్సిపాల్టి లో అధికార దాహాం
– వాణిజ్య అవసరాలు ట్యాప్ లు రెండు
– ట్రేడ్ లైసెన్స్ లు 191
– అనుమతి లేకుండానే సెల్ టవర్స్ ఏర్పాటు
టీ మీడియా,జనవరి 17, బెల్లంపల్లి:ముఖ్యమంత్రి కేసీఅర్ నేతృత్వం లో .పురపాలక మంత్రి కె టి ఆర్ సూచనల తో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీ లు అభివృద్ధి పథం లో నడుస్తున్న యి.బెల్లం పల్లి మున్సిపాల్టీ లోమాత్రం అధికార దాహం కొనసాగుతోంది.పట్టు మని లక్ష కూడా జనాభా లేని ఈ మున్సిపల్ అధికారులు తీరు పై గతం లో ను విమర్శలు ఉన్నయి.పాలక వర్గం లోని కొందరి గురించి చెప్పనవసరం లేదు.2022 జూలై లో నిర్వహించిన కే టి ఆర్ పుట్టిన రోజు వేడుకలు కు రాలేదు అని ముగ్గురు క్రింది స్థాయి సిబ్బంది కి మెమో లు ఇచ్చిన పరిస్థితి ఉంది.వీరి అధికార దాహానికి ఇది ఓక నిదర్శనం.తాజాగా మరి కొన్ని బాగోతాలు టి మీడియా పరిశీ లనలో బైట పడ్డాయి.
Also Read : గంటల వ్యవధిలో ఇద్దరు జవాన్లు ఆత్మహత్య
మంచి నీటి పంపులు కుంభ కోణం
మంచి నీటి పంపు కనెక్షన్లు కు 795 ధరకాస్తు లు రాగా అందులో 136 పెండింగ్ పెట్టినట్లు అధికారిక రికార్డుల్లో పేర్కొన్నారు. మొత్తం పంపు కనెక్షన్ లలో వాణిజ్య అవసరాలు కోసం వాడే అధికారిక పంపు కనెక్షన్ లు కేవలం 2 ఉన్నట్లు అధికారిక సమాచారం వల్ల తెలుస్తోంది.అనధికారికంగా భారీగా వాణిజ్య అవసరాల కోసం ఇంటి అవస రాలు పంపు పేరున కనెక్షన్లు మంజూరు ఇచ్చి మున్సిపల్ ఆదాయానికి గండి పెట్టీ స్వాహా చేస్తున్న రు అనేది స్పష్టం అవుతోంది.పరిశ్రమ ల అవసరాలు కోసం వినియో గిస్తున్నట్లు అధికారిక రికార్డులు లో మాత్రం ఒక్క కనెక్షన్ లేదు.అనధికారికంగా పదు లు సంఖ్య లో వినియోగం సాగుతోంది.
పట్టణ ప్రణాళిక లో కాసులు ఇస్తేనే..
పట్టణ ప్రణాళిక విభాగం లో అవిని తి కి అంతే లేదు కాసులు ఇస్తే నే ఇక్కడ ఫైల్ కదులు తుంది.1941 రోడ్డు కటింగ్ ఫైల్స్ పెండింగ్ ఉండగానే రోడ్లు కటింగ్ చేస్తున్నారు.ఇందుకు సమందించిన 795 ఫైల్స్ రిజెక్ట్ అయిన ధరకాస్తు దారు లు మాత్రం ముడుపులు ఇచ్చి అనుమతులు లేకుండా పనులు చేసు కొంటున్నారు అన్న ఆరోపణలు ఉన్నయి. ఇళ్ళ నిర్మాణం,ఇతర పన్నులు వసూలు డిమాండ్ లోనూ భారీ అవినీతి ఉంది.
వాణిజ్య సముదాయాలు కు ఇంటి పన్ను
మున్సిపాల్టీ లో మరో పెద్ద కుంభకోణం ఇంటి పన్నులు విషయం లో ఉన్నది అనేది తెలుస్తోంది .వాణిజ్య అవసరాలు కు వినియోగిస్తున్న కమర్షియల్ ప్రాంతం లోని నిర్మాణాలు కు ఇల్లు గా,నివాసం గా రికార్డు ల్లో చూపి భారీగా స్వాహా కార్యక్రమం జరుగుతుంది అనేది తెలుస్తోంది.
Also Read : కశ్మీర్లో లష్కరే ఉగ్రవాదులు హతం
గతం లో మెమో లు జారి బాగోతం
మంత్రి కే తారక రామారావు జన్మదిన వేడుకలకు హాజరుకాని ముగ్గురు ఉద్యోగులకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేశారు.2022 జులై 24న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరు కావాలని ఆఫీస్ సిబ్బందికి వాట్సప్ మెసేజ్ పంపారు. మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం ప్రకారం, సందేశం విస్మరించబడింది మరియు ముగ్గురు ఉద్యోగులు కార్యక్రమానికి హాజరు కాలేదు. టి రాజేశ్వరి (సీనియర్ అసిస్టెంట్), పున్నం చందర్ (జూనియర్ అసిస్టెంట్), మోహన్ (సిస్టమ్ మేనేజర్)లకు మెమోలు జారీ చేశారు.
(మరి కొన్ని వివరాలు మరో కధనం లో)
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube