శాస్త్రోక్తంగా ప‌విత్రోత్సవాలు ప్రారంభం

శాస్త్రోక్తంగా ప‌విత్రోత్సవాలు ప్రారంభం

1
TMedia (Telugu News) :

శాస్త్రోక్తంగా ప‌విత్రోత్సవాలు ప్రారంభం

టి మీడియా,సెప్టెంబర్ 22, తిరుప‌తి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Also Read : బీజేపీ నేతలకు ఆ ధైర్యం లేదు: కేటీఆర్‌

అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో ప్రభాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ వెంక‌ట‌శివ త‌దిత‌రులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube