తిరుపతి_తిరుమల వచ్చేవారికోసం

తిరుపతి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు

1
TMedia (Telugu News) :

తిరుపతి_తిరుమల వచ్చేవారికోసం

-తిరుపతి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు
టి మీడియా,జూన్ 26,తిరుమల:

హౌర్సెలీ హిల్స్
కొండలపై ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది…
ఇక్కడ మబ్బులు మనల్ని తాకుతూ వెళ్తున్న అనుభూతి కలుగుతుంది…
ఇక్కడికి ముప్పై కిలోమీటర్లు దూరంలో బోయగంగమ్మ ఆలయం ఉంది
పెద్ద ఆలయం ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది…

 

Also Read : ఆత్మకూరులో 82,742 ఓట్ల మెజారిటీతో వైసిపి ఘన విజయం

తలకోన లో శివాలయం ఉంటుంది మరియు చాలా ఎత్తునుండి జాలువారు జలపాతం ఉంటుంది…
జలపాతం మధ్య వరకు ఎక్కవచ్చు…
ప్రకృతి రమణీయత అద్భుతంగా ఉంటుంది…

శ్రీనివాసమంగాపురం లో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంటుంది…
ఇక్కడినుండే శ్రీవారి మెట్టు మార్గం(మరో నడక దారి) ద్వారా తిరుమల చేరుకోవచ్చు…

కాణిపాకంలో స్వయంభూ గణపతి ఆలయం ఉంటుంది…
కాణిపాకం కి దగ్గర్లో #అర్థగిరి శ్రీవీరాంజనేయస్వామి ఆలయం ఉంది. రామ,రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు… సంజీవరాయుడు సంజీవిని పర్వతం ఎత్తుకువచ్చే సమయంలో ఆ కొండలోని కొంత భాగం ఇక్కడ పడిందట….

చంద్రగిరిలో రాజులకోట ఉంటుంది
కోటకు ఎదురుగా కామాక్షమ్మ ఆలయం ఉంటుంది…

అప్పలాయగుంట లో ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది…
నెయ్యి దీపపు కాంతులలో స్వామివారు దర్శనమిస్తారు…

రాయవెల్లూరులో మహాలక్షిఅమ్మవారి బంగారు ఆలయం ఉంటుంది…

ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి ఆలయం ఉంటుంది…
ఆంధ్రా భద్రాద్రి…
ఏకాశిలపై శ్రీసీతారామ లక్ష్మణులను తీర్చిదిద్దారు…
ఆలయంలో ఆంజనేయ స్వామి ఉండరు…
ఆలయం ఎదురుగా మరో ఆలయంలో ఆంజనేయ స్వామి ఉంటారు…

 

Also Read : ఒక ఫోన్ కాల్ తో బ్యాంక్ సేవలు

శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీవాయులింగేశ్వరస్వామి ఆలయం ఉంటుంది…
తిరుపతి నుండి శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో భారతదేశంలో మొదటి శివాలయంగా పేరు గాంచిన
#గుడిమల్లం ఆలయం ఉంది… ఈ ఆలయంలో బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఒకే శిలపై ఉంటారు…
శ్రీకాళహస్తి వెళ్లే దారిలో తొండమనాడు అనే ఊరిలో తొందమాన్ చక్రవర్తి(పద్మావతి అమ్మవారి బాబాయ్) కట్టించిన
శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది…

నారాయణవనం లో కళ్యాణవెంకటేశ్వరస్వామి ఆలయం ఉంటుంది… శ్రీనివాసుడు పద్మావతిని పరిణయం ఆడిన ప్రదేశం

నాగలాపురంలో వేదనారాయణస్వామి ఆలయం ఉంటుంది… ఈ ఆలయంలో స్వామివారు మత్స్యావతారంలో దర్శనమిస్తారు…
ఈ ఆలయానికి మరో విశేషం ఉంది… ఇక్కడ ఆలయంలో మార్చ్ నెల 26,27,28 తేదీలలో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి…
నాగలాపురం కి నాలుగు కిలోమీటర్లు దూరంలో సురుటుపల్లి లో శివాలయం ఉంది…
ఇక్కడ పరమేశ్వరుడు పార్వతిదేవి ఒడిలో తలపెట్టుకుని ఉంటారు…
గరళం మింగినపుడు కొద్దిసేపు మూర్ఛపోయి పార్వతిదేవి ఒడిలో తలవాల్చారట…

తిరుత్తణిలో కుమారస్వామి ఆలయం ఉంటుంది….

కాంచీపురంలో కామాక్షమ్మ ఆలయం
అత్థివరధన్ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో బంగారుబల్లి, వెండిబల్లి ఉంటాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube