దేశానికి ఈ సభ ఒక దిక్సూచీ: కేరళ సీఎం

దేశానికి ఈ సభ ఒక దిక్సూచీ: కేరళ సీఎం

0
TMedia (Telugu News) :

దేశానికి ఈ సభ ఒక దిక్సూచీ: కేరళ సీఎం

టీ మీడియా, జనవరి 18,ఖమ్మం : ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ దేశానికి ఒక దిక్సూచి అని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిందేనని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని పినరయి విజయన్‌ అన్నారు. రాజ్యాంగానికి కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమపథకాలు అద్భుతం: కేరళ సీఎం పినరయి విజయన్‌తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్‌ కొనియాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

Also Read : కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు

లక్షలాది మందికి ఉపయోగపడే కంటి వెలుగు పథకం అద్భుతమని కొనియాడారు.ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ వేదిక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌, జాతీయ నేతలుఖమ్మంలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ వేదిక వద్దకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా చేరుకున్నారు. వేదికపై ఆశీనులయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube