సైన్స్‌కి సవాల్ ఈ ఆలయం..

- రోజుకు 3 సార్లు రంగులు మార్చే శివలింగం

0
TMedia (Telugu News) :

సైన్స్‌కి సవాల్ ఈ ఆలయం..

– రోజుకు 3 సార్లు రంగులు మార్చే శివలింగం

లహరి, ఫిబ్రవరి 18, ఆధ్యాత్మికం : భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.. వీటిల్లో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. సైన్స్ కు సవాల్ కు విసురుతూనే ఉంది. వాస్తవానికి, ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని ‘అచలేశ్వర్ మహాదేవ్’ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున, ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు.. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత.. భక్తులు సంఖ్య పెరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసంలోనూ శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. రంగురంగులు మారుస్తున్న శివలింగం గురించి అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. మరి రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే..

 

Also Read : అన్నీ వింతలే ఈ ఆలయంలో..

రోజుకు మూడు రంగులు:

ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం రోజు మూడుసార్లు రంగులు మారుస్తుంది. ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో.. సాయంత్రం వేళ చామర ఛాయగా (నీలం) రంగుల్లోకి మారి.. భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకూ ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ.. రంగులను మార్చే శివలింగాన్ని చూసి తరించిపోతారు.
ఆలయ విశిష్టత:

ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచ లోహాలతో తయారుచేశారు. ఇక్కడి పురాణ కధనం మేరకు.. ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది. ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివ లింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం శివలింగం స్వయం భూ కదా ? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు.

Also Read : ఆర్థిక ఇబ్బందులా.. గ్రహ దోషాలా..

 

మహిమ కలిగిన ఆలయం:

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ఇది మాత్రమే కాదు.. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లికాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే.. శివుడి అనుగ్రహంతో పెళ్ళికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట.

ఎలా చేరుకోవాలంటే..

రాజస్థాన్ లోని అన్ని ప్రధాన పట్టణాలనుండి ధోల్పూర్ కు బస్సులు ఉన్నాయి. ధోల్పూర్ రైల్వే జుంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వెళుతుంటాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube