గంజాయి కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు….ఏసిపి స్నేహ మెహ్రా.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్02,మధిర:

ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మధిర మండలం ఆత్కూర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుపడ్డ గంజాయి కేసులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కనితి రాము, ధూబి దరబాబు, వెట్టి సుబ్బారావు అరెస్టు చేసినట్లు వైరా ఏసిపి స్నేహ మెహ్రా తెలిపారు. ఈరోజు మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అక్రమంగా గంజాయి రవాణా చేసే వారి వద్ద నుండి 157.800 కేజీల గంజాయి ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ కానిస్టేబుల్ సుధాకర్, నాగేశ్వరరావు, రామారావు ను ఆమె అభినందించారు. మధిర సిఐ మురళి ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయ్ని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

Three accused arrested in cannabis
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube