తిరుమలలో బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు దళారులు అరెస్ట్
తిరుమలలో బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు దళారులు అరెస్ట్
తిరుమలలో బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు దళారులు అరెస్ట్
లహరి, ఫిబ్రవరి 9, తిరుమల : భక్తుల అవసరాలను ఆసరా చేసుకుని దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన రూ. 500 టికెట్లను బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన భక్తులకు దళారీలు అధిక ధరకు విక్రయించి పట్టుబడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సిఫార్సు లేఖతో దర్శనానికి వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వెళ్లగా వారిని విజిలెన్స్ వింగ్ అధికారులు తనిఖీలు చేయగా పట్టుబడ్డారు. బెంగళూరు భక్తులకు రూ. 500 విలువైన 5 వీఐపీ టికెట్లు రూ. 31,500లకు , హైదరాబాద్ భక్తులకు రూ. 500 విలువైన మూడు వీఐపీ టికెట్లు రూ. 15000లకు విక్రయించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో దళారీలు తులసి, వెంకటేశ్, రఘురామన్‌పై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.