ఉత్తర ద్వార దర్శనంతో ముక్తి

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి

0
TMedia (Telugu News) :

ఉత్తర ద్వార దర్శనంతో ముక్తి

– కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి

– భక్తులకు ఎంపీ నామ శుభాకాంక్షలు

టీ మీడియా, డిసెంబర్ 23, ఖమ్మం బ్యూరో : వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం సందర్భంగా బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని అన్నారు.కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి గా పేర్కొంటారని చెప్పారు. మహా విష్ణువు దర్శనం తో మనలోని అజ్ఞానం తొలగి, శాశ్వతమైన శాంతి, జ్ఞానాన్ని కలుగజేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి, భగవంతుని కృపకు పాత్రులు కావాలని నామ ఆకాంక్షించారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే వేళ ఈ పర్వ దినాన ఆ భగవంతుడు ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి, భక్తులకు దర్శనం ఇస్తారని, దర్శించుకుని, ముక్తిని పొందాలన్నారు.

Also Read : గులాబి లీడర్ల గోల్ మాల్

ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ మహా దేవుడిని దర్శించుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభించడంతో పాటు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసమని తెలిపారు. పవిత్రమైన ఈ పండుగ పర్వదినాన అన్ని దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేయడం ఆనవాయితీ అన్నారు. భక్తులందరూ వైకుంఠ ద్వార దర్శనం లో పాల్గొని, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube