కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజులు శివరాత్రి ఉత్సవాలు

కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజులు శివరాత్రి ఉత్సవాలు

0
TMedia (Telugu News) :

కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజులు శివరాత్రి ఉత్సవాలు

లహరి, ఫిబ్రవరి 16, జయశంకర్ భూపాలపల్లి : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శివ రాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పుర మండలం కాళేశ్వర క్షేత్రంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. 18 నుంచి శివరాత్రి సందర్భంగా భక్తులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. 19న సాయంకాలం 4.30 గంటలకు ఆదిముక్తీశ్వరాలయంలో జరిగే స్వామి వారి కల్యాణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. శివపార్వతుల కల్యాణానికి ఆహ్వానం కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

Also Read : పొరపాట్లు సరిదిద్దుకోండి

18న శుభానంద ముక్తీశ్వర కల్యాణం ఆలయ ఆవరణ లోని కల్యాణ మండపంలో అర్చకులు విశేష పూజల నడుమ తంతు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు కొంతమందికి కల్యాణ మహోత్సవ ఆహ్వానాలను పంపించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గం ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్తు ఛైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచితో పాటు ఆలయ దాతలకు ఆహ్వాన పత్రికలను పంపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube