ఒకే కాన్పులో ముగ్గురు సంతానం

-పి హెచ్ సి చరిత్రలో ప్రథమం

1
TMedia (Telugu News) :

ఒకే కాన్పులో ముగ్గురు సంతానం

-పి హెచ్ సి చరిత్రలో ప్రథమం

టీ మీడియా,సెప్టెంబర్ 20,చాగల్లు :ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు ఆడ శిశువులు జన్మించటం గ్రామంలో విశేషమైంది. స్థానిక వైద్యాధికారుణులు కె.లక్ష్మీప్రియ, కె.ఇందురేఖ తెలిపిన వివరాలు ప్రకారం.. చాగల్లు శివారు ప్రాంతం మీనానగరానికి చెందిన కొక్కిరపాటి సంద్యకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడ శిశువులు జన్మించారు. ఆమెకు ఇది రెండవ కాన్పు అవ్వగా మొదటి కాన్పులో సైతం ఒక ఆడపిల్ల పుట్టడం విశేషం.

Also Read : మెక్సికోను వణికించిన భారీ భూకంపం..

 

గర్భిణి సమయం నుంచి ప్రభుత్వ వైద్యులు సలహా మేరకు ఆహార నియమాలతో పాటు వారు సూచించిన మందులను వేసుకోవడంతో ఆరోగ్యవంతమైన ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ముగ్గురు పిల్లలు 1.7 కిలోల బరువుతో జన్మించిన వీరితో పాటు తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారుణులు వెల్లడించారు. సంద్య గర్భం దాల్చినప్పటి నుంచి పూర్తిస్థాయి ఆరోగ్యంపై తమ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించడంతో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారుణులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురి సంతానం కలిగిన తల్లిదండ్రులకు వైద్య, అశాకర్యకర్తలు, ఐ.సి.డి.ఎస్. సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని అభివృద్ధి కమిటీ చైర్మన్ జుజ్జవరపు రామచంద్రరావుతో పాటు పలువురు నాయకులు, అధికారులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube