3 వేల గజాలు మురుగు కాలువ మాయం

ఖమ్మం:నగరం లో బుకబ్జాలు ఒక్కొక్కటిగా బైట పడుతున్నాయి.ఇప్పటికే ప్రబాత్ టాకీస్ వద్ద ఉన్న పాఠశాల లోని సెట్కం షాపులు ప్రవైట్ గా కార్పొరేషన్ రికార్డులలో పేర్కొన్న వైనం టి మీడియా బైట పెట్టింది..ద్ధినిపై విచారణ ఆరంభం అయినట్లు తెలిసింది.అదే రీతిలో ఇరిగేషన్ కాలువను పూడ్చి వేసి వ్యక్తిగత ఆస్తి అంటూ సుమారు 3 వేల గజాల స్థలం విక్రయించి పెక్కనే ఉన్న పొలం సర్వే నెంబర్ వేసి రిజిస్టేషన్ చేసిన దుర్మార్గం మరొకటి బైట పడింది.కాలువ తో పాటు సమీపం లో ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్ట ను సైతం విక్రయించి రిజిస్టేషన్ చేశారు.విషయం తెలియని మధ్యతరగతి వారు కొనుకొని భవనాలు నిర్మించారు వీటిలో కొన్ని ఇళ్లకు సమీపం లోని ఇళ్ల నెంబర్లకు బై నెంబర్లతో మున్సిపాలిటీ వారు నెంబర్లు ఇచ్చారు.

నగారా నికి నడి బొడ్డున ఉండి. అత్యంత విలువైన ఈ భూమి రక్షణ విషయం లో అధికారుల నిర్లక్ష్యం అనుమానం కు తావిస్తోంది.మునేరు ను అనుకోని ఉన్న స్మశానం బై పాస్ వెంబడి కోర్టు వివాదం లో ఉన్నసర్వే నెంబర్ 113,114 అనుకోని సుమారు 150 అడుగుల వెడల్పుతో మురుగు కాలువ ఉంది.కాల్వడ్డు అంజనేయ స్వామి దేవస్థానం,వెంకట లక్ష్మీ టాకీస్ మీదు గా రంగ నాయకులు గుట్ట ఎదురుగా రెండు పాయలుగా మునేరు లోకి ఇరిగేషన్ కాలువ ఉంది.ఇప్పుడు ఈ కాలువ అక్కడి బైపాస్ దాటగానే కుచించుకు పోయింది ప్రస్తుతం 3 అడుగులు కూడా లేదు.స్థానికంగా ఉన్న పాషా అనే వ్యక్తి తో పాటు,సంబాని నగరు కు చెందిన మరొక వ్యక్తి పేరున ఖమ్మం రిజిస్ట్రేషన్ కార్యాలయం దస్తావేజులు ఉన్నాయి.వాటిలో పేర్కొన్న సర్వే నెంబర్లు హద్దులు లు పరిశీలిస్తే ఆ భూమి కాలువకు,ప్రభుత్వ స్థలం లోని గుట్ట గా వెల్లడి అయింది.విక్రయాలు చేసిన ఈ అక్రమార్కులు వెనుక ఒక మాజీ కౌన్సిలర్ తో పాటు,ఒక బినామీ రేషన్ డీలర్,రిటైర్డ్ టీచర్ కూడా ఉన్నట్లు తెలిసింది.అయితే విక్రయాలు చేసినట్లు దస్తావేజులు లో ఉన్న పేర్లు కలవారు.వారు ఉండే నివాస గృహాలు అమ్ముకొని కుటుంబ తో సహా పరారీ లో ఉన్నారు. సూత్రదారులు మాత్రం స్థానికంగా మరికొన్ని కబ్జాలు కు తెరలేపారు.