ఇది బూత్ లెవెల్ కమిటీ సమావేశమా.. మినీ ప్రజాఆశీర్వాద సభ నా
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన తుమ్మల,పొంగులేటి
ఇది బూత్ లెవెల్ కమిటీ సమావేశమా.. మినీ ప్రజాఆశీర్వాద సభ నా
– కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన తుమ్మల,పొంగులేటి
– అధికార పార్టీ గుండెల్లో గుబులు
టీ మీడియా, నవంబర్ 18, అశ్వరావుపేట : అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో శనివారం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.వారి రాక కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు తప్ప పెద్ద ప్రచారం కూడా లేకపోయినప్పటికీ ఈ సమావేశానికి సుమారు 6 వేల మంది పైగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాత తరం కాంగ్రెస్ నాయకులు అందరూ రావడం కాంగ్రెస్ శ్రేణులు శుభసూచకంగా భావిస్తున్నారు. ఇది అసలు సాదాసీదా బూతు లెవల్ కమిటీ సమావేశమా సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను ఉదహరించే విధంగా మినీ ప్రజా ఆశీర్వాద సభన అని అనుకోక తప్పదు. ఆ స్థాయిలో ఈ సమావేశం జరిగింది. నియోజవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read : పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం..
ఈ సమావేశంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మనందరి లక్యం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావటమే పరమావధిగా పనిచేయాలని జారే ఆదినారాయణ కు అఖండ మెజార్టీతో గెలిపించి మీ సత్తా చాటుకోవాలని మీకు అన్నివేళలా మేమిద్దరం అండగా ఉంటామని మీకు ఏ విధమైన కష్టమొచ్చినా తాము వెన్నంటే ఉంటామని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అభయం ఇచ్చారు. కార్పొరేట్ శక్తులు ఎన్నికలలో డబ్బులు వెదజల్లి ప్రజలని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని వారు ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారని మేము ఇక్కడే ఉంటామని మీ అందరికీ తోడు ఉంటామని ఈ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మీరు నన్ను చూశారని అన్నారు. మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి నన్ను మీరు గమనిస్తూనే ఉన్నారని నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి కష్టసుఖాలలో నేను ఏ విధంగా ఉన్నానో జిల్లా ప్రజలందరికీ తెలుసు అని నియోజకవర్గంలో జారే ఆదినారాయణ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ పది రోజులు నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లో దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు
Also Read : తెలంగాణ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి కౌంట్ లెస్..
ఈరోజు ఈ బూతు లెవల్ సమావేశానికి స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మీకు ఏ కష్టం వచ్చినా జిల్లాలో పిలిస్తే పలికే మేమిద్దరం ఉన్నామని అన్నారు. ఈ సమావేశానికి స్వచ్ఛందంగా 6వేల మంది పైగా హాజరు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులును పేరుపేరునా అందరిని స్వయంగా తుమ్మల పొంగులేటి స్టేజి మీదకి ఆహ్వానించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఇదిలా ఉండగా అధికార పార్టీ నాయకులకు మాత్రం వారి గుండెల్లో అలజడి మొదలైంది అని ఈరోజు నుండి వారికి కంటిమీద కునుకు కూడా ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube