ఖమ్మంలో తుమ్మల తొలి నామినేషన్

- కాంగ్రెస్ పథకాలు గెలిపిస్తాయని ధీమా

0
TMedia (Telugu News) :

ఖమ్మంలో తుమ్మల తొలి నామినేషన్

– కాంగ్రెస్ పథకాలు గెలిపిస్తాయని ధీమా

టీ మీడియా, నవంబర్ 3, ఖమ్మం బ్యూరో : ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఖమ్మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి వద్ద నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ… సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా, ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తానని ఆన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకుందామన్నారు. ఆరు గ్యారంటీ పథకాల అమలుతో తెలంగాణ భవిష్యత్ మారనుందని పేర్కొన్నారు.

Also Read : వెంకన్న గౌడ్‌కు నివాళులు అర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

నిరంకుశ, అవినీతి, ఆప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ఖమ్మంతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకం చారిత్రక తీర్పు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తుమ్మల వెంట కాంగ్రెస్ నాయకులు మలీదు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కమర్తపు మురళి, సాదు రమేష్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube