నూతన పాఠశాలల కేటాయింపు పై మార్గదర్శకాలు విడుదల చేయాలి-టియస్ యుటీయఫ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్

317 జీవో అమలు కారణంగా నూతన జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులకు పాఠశాలల కేటాయింపుకై మార్గదర్శకాలు రూపొందించి వెంటనే విడుదల చేయాలని టియస్ యుటీయఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవోలో స్థానికత కు ప్రాధాన్యత ఇవ్వడం వలన జూనియర్ ఉపాధ్యాయులకు నష్టం జరిగిందని,బోనకల్ మండలం నుండి పదిమంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు,11 మంది ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మండలం నుండి దూరప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే న్యాయం జరిగేదని,జిల్లా ఆలొకేషన్ పూర్తయిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలలో చేపట్టబోయే బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని,నూతన బదిలీల వలన భార్యాభర్తలు దూరంగా ఉండవలసి వస్తుంది అని, మ్యూచువల్ బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ,మండల ఉపాధ్యక్షులు కంభం రమేష్, మండల కోశాధికారి ఆలస్యం పుల్లారావు, ఉపాధ్యక్షురాలు పి సుశీల, కే అనిల్ కుమార్, పి గోపాల్ రావు, ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, శ్రీనివాసరావు,పీ నరసింహారావు,కె నాగలక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, యన్ సైదారావు, ఎం నారాయణ రావు, టి లక్ష్మి, వి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube