టిప్పర్ ,ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు

టిప్పర్ ,ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు

0
TMedia (Telugu News) :

టిప్పర్ ,ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు

టీ మీడియా, జూన్ 02, రేవల్లి :

 

మండల పరిధిలో కొత్త బండ రాయిపాకుల వద్ద రహదారి పై టిప్పర్ ,ద్విచక్ర వాహన ప్రమాదవశాత్తు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డడం జరిగింది. ఈ ప్రమాదం పై స్థానిక ఎస్ఐ తిరుపతి రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఈ నెల ఒకటవ తేది నాడునాగపూర్ గ్రామానికి చెందిన కత్తే రాములు అనే యువకుడు తన ద్విచక్ర వాహనం పైబొడ్డుపల్లి శివ అనే మరో యువకున్నివెనకల కూర్చొబెట్టుకొని ఇద్ధరు కలిసి కొత్త బండరాయిపాకుల వైపు వెళుతుండగా ఎదురుగా వస్తునటువంటి టి ఎస్ 31 టీ ఏ 0583 నంబరు గల టీప్పర్ కొత్తబండరాయిపాకుల నుండి రేవల్లి కి
వెళ్తున్న క్రమంలో మధ్యలో ఉన్న కాలువా మార్గాం దగ్గర వస్తున్నా ప్రమాదవశాత్తు టీప్పర్ ను చూస్కోకుండా వెళ్లి డికొన్నారు, ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ఉన్నటువంటి కత్తే రాములు కు మరియు శివ కు కొన్ని గాయాలు కావడంతో వారిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్ కర్నూలు ప్రబుత్వ ఆసుపత్రి కి తీసుకువెళ్లారు.చికిత్స అనంతరం వారి పరిస్థితి మంచి గానే ఉంది అని, బొడ్డుపల్లి శివ తండ్రి అయిన అంజయ్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube