బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా గజరాజులు, అశ్వాలు

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా గజరాజులు, అశ్వాలు

1
TMedia (Telugu News) :

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా గజరాజులు, అశ్వాలు

టీ మీడియా,సెప్టెంబర్ 19, తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరంలో గజరాజులు, అశ్వాలు, వృషభాలు కీలకపాత్ర పోషించనున్నాయి. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వీటిదే. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కనువిందు చేస్తాయి. సర్వాంగసుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారన్న సంకేతం ఇస్తాయి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో వీటి ఆలనా పాలనా చూస్తూ సంరక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో వినియోగించే జంతువులకు తగిన శిక్షణ కూడా ఇస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం (ముల్లు కట్టె), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉండి గజరాజులను నియంత్రిస్తారు.

Also Read : భారీగా పట్టుబడిన ఈ-సిగరెట్లు

జంతువులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరేగింపులకు వినియోగిస్తారు. జంతువుల వెంట జంతుశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినపుడు జంతువులను నియంత్రించేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మాడవీధుల్లో గజరాజులు తిరిగేందుకు ప్రత్యేక మార్గాన్ని కూడా రూపొందించడం విశేషం. ఏనుగులను అదుపు చేసేందుకు కేరళ నుంచి నిపుణులైన‌ పశువైద్యులను రప్పిస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube