క్యూలైన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిన భక్తుడు

క్యూలైన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిన భక్తుడు

1
TMedia (Telugu News) :

క్యూలైన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిన భక్తుడు

టి మీడియా, నవంబరు6,తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటనాధుని దర్శించుకునేందుకు భక్తులు దేశవిదేశాలనుంచి తరలి వస్తారు. శ్రీమన్నారాయణుని కళ్లారా చూసి తరించాలని గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి శ్రీనివాసుని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. హరిహరులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నెలలో శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అలా శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఆ శ్రీమన్నారాయణుడి సన్నిధిలోనే కన్నుమూసాడు.

Also Read : రైతుల కోసం ప్రత్యేక పథకం

శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్‌ వద్ద క్యూ లైన్‌లో నిల్చున్న గుర్తు తెలియని భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. క్యూలైన్‌లో నిలుచున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి భక్తులు అక్కడి సిబ్బంది అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యక్తి మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube