మార్చురీనీ సందర్శించిన టీజేఏసీ నాయకులు

మార్చురీనీ సందర్శించిన టీజేఏసీ నాయకులు

1
TMedia (Telugu News) :

మార్చురీనీ సందర్శించిన టీజేఏసీ నాయకులు

టీ మీడియా, మే 18, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీనీ సందర్శించిన తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రధాన హాస్పిటల్లో ఈలాంటి దారుణమైన దుస్థితి దాపురించింది. ఎంతో మంది నాయకులు , ప్రజా ప్రతినిధులు మార్చరీ సెంటర్కు శవాలను చూడడానికి వచ్చిపోయే నాయకులు ఇక్కడికి వచ్చి పోతుంటారు. పట్టించుకొనే నాథుడు లేడు ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్ వస్తే ఈ చెత్త కుప్పల పోస్టుమార్టం చేసిన కవర్ల మూటలు అంతా కంపు వాసనతో పక్కనే జూనియర్ కళాశాల వాకింగ్ చేసే ప్రజలు ఆ కవర్లను చూసి, భయంకరమైన వాసనతో లేనిపోని రోగాలూ వచ్చే అవకాశం ఉంది.

Also Read : లయన్స్ క్లబ్ అద్వర్యం లో ఉచితంగా బిపి.షుగర్ టెస్టులు

స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా తక్షణమే హాస్పిటల్లో సందర్శించి పరిశుభ్రతను గమనించవలసిన అవసరం ఎంతగానో ఉందని మేము కోరుతున్నాము. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా మీరు తక్షణమే హాస్పిటల్లో అభివృద్ధి చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ టౌన్ అధ్యక్షులు రఘు నాయుడు, టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతి రామ్ నాయక్ గారు,బీసీ నాయకులు లింగస్వామి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube