నేడు భీష్మ ఏకాదశి.

నేడు భీష్మ ఏకాదశి.

0
TMedia (Telugu News) :

నేడు భీష్మ ఏకాదశి..

లహరి, ఫిబ్రవరి 1, ఆధ్యాత్మికం : అత్యంత పవిత్రమైన ఈ రోజుని భీష్మ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. నేడు భీష్మ ఏకాదశి.. ఈరోజు ఈ స్తోత్రాన్ని విన్నా పఠించినా అష్టైశ్వర్యాలు లభిస్తాయట మాఘమాసం హిందువులకు అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, దానానికి విశిష్ట స్థానం ఉంది. శుక్ల పక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలవబడుతోంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు.. ఇచ్ఛ మృత్యు వరంతో పవిత్రమైన మాఘమాస ఏకాదశి కోసం అంపశయ్య మీద ఎదురుచూశాడు. తన అంతిమ ఘడియల్లో భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని ఏకాదశి రోజునే బోధించాడు.

అత్యంత పవిత్రమైన ఈ రోజుని భీష్మ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ఉవాచ.

భీష్మ ఏకాదశి విశిష్టత: గంగా, శంతనుల ఎనిమిదవ సంతానం భీష్ముడు. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం దేవవ్రతుడు… ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని చెప్పాడు. తన జీవితంలో పెళ్లి అనే మాటకు చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి.. ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి.. భీష్ముడికి స్వచ్చంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్దాన్నికి దిగిన భీష్ముడు.. అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని.. మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ.. పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించాడు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ… మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు ధర్మ రాజు సందేహానికి సమాధానంగా లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే… “జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం” అంటూ ప్రారంభించి, “విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:” అంటూ విష్ణసహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు.

Also Read : కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం

మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణదినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా.. మాఘశుద్ధ అష్టమి తిథిరోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని భీష్మపితామహుని మహాప్రస్థానం మాఘమాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ రోజు భీష్మ ఏకాదశిగా పిలవడుతోంది. భీష్ముడు ప్రవచించిన “విష్ణుసహస్రనామస్తోత్రం” ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని “భీష్మాష్టమి”గాను, మాఘశుద్ధ ఏకాదశిని “భీష్మఏకాదశి”గాను హిందువులు జరుపుకుంటారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube