నేడు రాములోరి పెళ్లి -సర్వం సిద్ధం చేసిన అధికారులు

హాజరు కానున్న మంత్రులు,పువ్వాడ,ఇంద్రకరణ్ రెడ్డి

1
TMedia (Telugu News) :

నేడు రాములోరి పెళ్లి

-సర్వం సిద్ధం చేసిన అధికారులు

-హాజరు కానున్న మంత్రులు,పువ్వాడ,ఇంద్రకరణ్ రెడ్డి
-చలువ పందిళ్ల తో ముస్తాబైన మిథాలి స్టేడియం.

టీ మీడియా,ఏప్రిల్ 9, భద్రాచలం:

దక్షిణ అయోద్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య కల్యాణం ఆదివారం జరుగ నున్నది.కల్యాణం భక్తులు తిలకించేందుకు దేవస్థానం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా తో భద్రాచలం దేవస్థానం భక్తుల్లేక బోసిపోయింది,ఈసారి శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు హాజరు కానున్నారు.స్వామి కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు.

Also Read : ఇండ్ల రుణ వ‌డ్డీ చౌక‌ ..ఎందుకంటే?!

ప్రతి ఏడాది చైత్ర మాస శుక్లపక్ష నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అనాదిగా భద్రాచలం దేవస్థానంలో స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ఏప్రిల్ 10న సీతారామచంద్ర స్వామి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు దేశ, విదేశాల నుంచి భారీగా తరలి రానుండటంతో వారి కోసం మిథిలా స్టేడియంని సుందరంగా తీర్చిదిద్దారు. షామియానాలు, చలువ పందిళ్లుతో పాటు భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు ఏర్పాటు చేసారు. ఇక స్నానఘట్టాల్లో మహిళలు ఇబ్బందులు పడకుండా డ్రస్సింగ్ రూములను ఏర్పాటు చేసారు. భద్రాచలం భక్తులకు వాల్ రైటింగ్స్‌తో, హోర్డింగ్‌లతో, ప్లెక్సీలతో స్వాగతం పలుకుతుంది. భద్రాచలంతో పాటు కూనవరం రోడ్డు, చర్ల రోడ్డు, బ్రిడ్జి సెంటర్‌లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఆలయానికి ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం కూడా అధికారులు చేపట్టారు. భక్తులకు ఆన్‌లైన్ సేవలతో పాటు రూముల కేటాయింపు సైతం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భక్తుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మకం చేపడుతున్నారు. ఒక్కో టిక్కెట్‌ ధరను 150 రూపాయల నుంచి 7,500 వరకు టిక్కెట్లు ధరను నిర్ణయించి అమ్మకాలు చేపట్టారు. ఇక రెండేళ్ల తరువాత రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులతో భద్రాద్రి పోటెత్తనుంది. దీంతో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా అదనపు బస్సులను నడపనుంది. రామయ్య కల్యాణ మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, తలాంబ్రాలను ఎవరు సమర్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : ‘బుల్‌బుల్ త‌రంగ్’ ప్రోమో విడుద‌ల‌..

అయితే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం లేదని స్పష్టం అయింది. సీతాసమేతంగా రాముడు సంచరించిన పుణ్య నేల భద్రాద్రి. తరతరాలుగా ఇక్కడ సాంప్రదాయబద్దంగా జరిగే శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఆ నాటి కాలం నుండి శ్రీ సీతారామచంద్రస్వామి వేడుకలకు, గౌరవ మర్యాదలకు లోటు లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్య మంత్రులందరూ రాములోరి కళ్యాణం కు ప్రతిసారి హాజరై, తరతరాల సంప్రదాయానికి ప్రతీకగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సిఎం కేసిఆర్ మాత్రమే ఒక్కసారి రాములోరి కళ్యాణంకు హాజరయ్యారు.
కళ్యాణం రోజు ముఖ్యమంత్రి, శ్రీరామనవమి రోజున గవర్నర్ హాజరై ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా అదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే 2015లో తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు, అనంతరం ఆయన ఈ వేడుకలకు హాజరు కాలేదు. రాష్ట్ర మంత్రులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. గత రెండేళ్లు కోవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలను భక్తులు లేకుండా నిరాడంబరంగా నిర్వహించారు. అయితే ఈసారి కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో భక్తుల సమక్షంలోనే ఈసారి ఈ వేడుకను జరుపుతున్నారు. మరి ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఉగాది రోజున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అధికారులు, అర్చకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లను కలిసి వేద ఆశీర్వాదం అందజేసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను పంచారు.

Also Read : 11న శ్రీరామ‌న‌వ‌మి శోభ‌యాత్ర‌ : ట్రాఫిక్ ఆంక్ష‌లు

అయితే తాను ఏప్రిల్ 11న జరగనున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని, మరుసటి రోజు 12వ తేదీన కూడా జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని రాష్ట్ర గవర్నర్ దేవస్థానం అధికారులకు విన్నవించినట్టు తెలిసింది. దీంతో గవర్నర్ పర్యటన దాదాపు ఖరారు అయినట్లే అని భావిస్తున్నారు. కేసీఆర్ మాత్రం ఆహ్వాన పత్రికను అందుకున్నారు కానీ, ఎటువంటి విషయం కూడా మాట్లాడలేదని, ఇప్పటివరకు దేవస్థానం వారు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే సీఎం కార్యాలయం ఉద్యోగులు మాత్రం, సీఎం ఈసారి వచ్చే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వారికి తెలియజేసినట్లు సమాచారం, ఏదేమైనా పూర్తి స్పష్టత మాత్రం రాలేదు

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు వస్తారని ప్రచారం జరుగుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube